తప్పు చెయ్యొద్దు అంటే మీ వాళ్ళు తప్పు చేశారు కదా!

ఆంధ్రుడు: అదేమిటి అవి మనల్ని ఉత్తేజ పరచడానికి కదా వింటున్నారు కదా అని నువ్వేది చెప్పినా వీనేస్తాము అనుకుంటున్నావా?
వాస్తవ ప్రపంచంలో జీవించండి....
ఆంధ్రుడు:ఏమిటి, నిజంగా నా?
స్నేహితుడు: నిజమే, వాటిలో మొదటిది ఇల్లు కట్టడం.
ఆంధ్రుడు: ఇళ్ళు లేకుంటే ఎక్కడ జీవిస్తాం?
స్నేహితుడు: నిజమే నాకు తెలియదు ఇల్లు లేకపోతే జీవించడం కష్టం అని. ఇప్పటి వరకూ ఇల్లు కట్టకుండా జీవించ వచ్చు అనుకున్నానే
ఆంధ్రుడు: చాల్లే వెటకారం ముందు చెప్పు ఇల్లు లేకుండా ఎలా జీవించగలం?
స్నేహితుడు: నేను ఇల్లు కట్టడం నేరం అన్నాను కానీ ఇల్లు లేకుండా బ్రతకగలం అనలేదు కదా
ఆంధ్రుడు: రెంటికీ తేడా ఏమిటి?
స్నేహితుడు: మొదటిది ఇల్లు కట్టడం అంటే ప్రకృతిని జీవరాసికి ఉపయోగం లేకుండా చెయ్యడం, ఇల్లు లేకపోవడం అంటే మనం నివసించడానికి ప్రదేశం లేకపోవడం
ఆంధ్రుడు: రెండింటికీ తేడా ఏమిటి?
స్నేహితుడు: ఇప్పుడే చెప్పాను కదా, సరే మీకు ఇంకా విడమర్చి చెబుతాను మనకు మన స్వగ్రమంలో ఇల్లు ఉంది, కానీ ఉద్యోగ రిత్యా వేరే ప్రాంతానికి బదిలీ అయ్యాము అక్కడ ఇల్లు కట్టుకోవడం, అంటే అక్కడ భూమిని ఉపయోగం లేని విధంగా మార్చడం అన్నమాట.
ఆంధ్రుడు: మీ కాలంలో చేస్తే ఒప్పు ఇప్పుడు చేస్తే తప్పా?
ఏకాకి: మీ మొదటి ప్రశ్న నువ్వు చేస్తే ఒప్పు నేను చేస్తే తప్పు, బంధాలు తెగిపోవడానికి మొదటి కారణం ఇది.
స్నేహితుడు: ఆగండి స్వామి మీరు అలా వాళ్ళ స్వభావం చెప్పేస్తే నిజం ఎప్పటికీ తెలుసుకోలేరు
నువ్వు ఆ ప్రశ్న నీ మనస్సాక్షిని అడుగు నీకే సమాధానం తెలుస్తుంది
అడిగే ముందు ఒక్కసారి ప్రశ్నించుకో ఈ ప్రశ్నలను
1. భూమి లోపలికి నీరు ఎలా వెళుతుంది?
2. నువ్వు తినే ఆహారం ఎక్కడ నుంచీ వస్తుంది
3. జంతు జాతిని TV లో నీ తరువాత తరానికి చూపిస్తావా
4. నీ తరువాత తరానికి పోషక విలువలలో కూడా కోటా పాద్ధతి ప్రవేశ పెట్టగలవా?
ఆంధ్రుడు: ఆకలి వేస్తుంది ఆకలి తీరాకా చెబుతాను
(సశేషం..)

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.