తెలివైన వాడు చేసిన తప్పు ఏమిటి?

అందరూ తినడానికి వెళ్ళారు, అక్కడ నుంచీ అగమ్యి స్నేహితుడు మాత్రం వెళ్ళలేదు.
ఆకలి తీరిందా?
ఆంధ్రుడు: అమలు పరచడం అంటే ఏమిటి? మేము అన్నీ మా నెత్తిన ఎత్తుకోవాలా?
స్నేహితుడు: నేను అలా చెప్పలేదు, ఆ మొదట ఆ నాలుగు ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి అంటున్నాను, వాటికి సమాధానం తెలియనంత కాలం మనం మన కాళ్ళు నరకడానికి ఇంకొకరికి ఆయుధం ఇస్తూనే ఉంటాము.
ఆంధ్రుడు: ఏమిటి నువ్వనేది, మనం మన కాళ్ళు నరుక్కోవడానికి ఇంకొకడికి ఆయుధం ఇస్తున్నామా?
స్నేహితుడు:  ఎదుట వాడు ఆకాశంలో ఉన్నాడు అని అనుకుని వాడు తప్పు చేసినా తప్పు కాదు అని వాదించడమే ఈ ఆయుధం ఇవ్వడం.
ఆంధ్రుడు: ఏది పడితే అది మాట్లాడకు, మా ముందరి కాళ్ళకు బంధం వేయడానికే మీ ఈ ప్రయత్నం.
స్నేహితుడు: ముందరి కాళ్ళకు బంధం మేము ఎందుకు వెయ్యకూడదు అంటే, రేపటి మీ తరానికి కావలిసినవి దూరం చేస్తున్నా ఒప్పుకోవడమా?
ఆంధ్రుడు: అదే మీ ముసలి వాళ్ళతో వచ్చిన తగువు.
స్నేహితుడు: సరే ఇంతకీ నా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నావు,
ఆంధ్రుడు(మనసులో): ఈయన అభిప్రాయం చూస్తుంటే నేను సమాధానాలు చెప్పకపోతే వదిలేలా లేడు.
ఆంధ్రుడు:  సరే సమాధానాలు చెబుతాను, మీరు నన్ను ఇంకా ప్రశ్నలు అడగకూడదు?
స్నేహితుడు:నీ సమాధానం పరీక్షలో సమాధానం లా ఉండ కూడదు, జీవితం చూసేలా ఉండాలి అప్పుడు నా ప్రశ్నలు ఆగిపోతాయి!
ఆంధ్రుడు: అంటే, నేను సమాధానం చెప్పలేను అనా?
స్నేహితుడు: లేవు అని కాదు సమాధానం కోసం ప్రయత్నించవు అని.
(సశేషం...)

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.