మనల్ని రక్షించు కోవాలి అంటే డబ్బు కోసం పాకులాడని వాళ్ళు మన దగ్గర ఉండాలి

ఆంధ్రుడు:అదేమిటి బట్టలు ఉతకడం తరువాత ప్లేట్లు కడగడం తరువాత
రక్షక దళ సభ్యులు ఉన్నారా?
ఆంధ్రుడు:అర్ధం కాలేదు!
స్వామి:మీకు నిన్న చెప్పాను కదా నేను మా తల్లిదండ్రులకు దూరం అయ్యాను అని, వాళ్ళు నన్ను క్షమించట్లేదు అని మీరు అనుకుంటున్నారు కానీ నాకు తెలిసిన ఒక విషయం, మా తల్లిదండ్రులు మా దగ్గరకు వచ్చారు, తరువాత వాళ్ళు కొంచం అస్వస్థకు గురయ్యారు దాంతో వైధ్యుడి దగ్గరకు తీసుకు వెళితే మందులు వ్రాసారు, కానీ ఆయన వ్రాసిన మందులు కాదు నేను కొన్నది మా మామగారు ఈ మధ్యలో చేయించిన Transcript మార్పు వల్ల వాళ్ళు అనారోగ్యానికి గురయ్యారు, తరువాత వైధ్యుడి దగ్గరకు తీసుకు వెళితే ఈ మందులు ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వాడరాదు అన్నారు!
ఆంధ్రుడు:అవును Transcript ఎలా మార్పించారు?
స్వామి:తెలుసుకోవడం అవసరమా?
ఆంధ్రుడు:మీరు అబద్దం చెబుతున్నారో నిజం చెబుతున్నారో తెలుసుకోవడానికి!
స్వామి:సర్లే నీ అపనమ్మకం నీది సరే చెబుతున్నాను నేను నా భార్య విడిపోయాము అని చెప్పాను కదా, అప్పుడు కొన్ని విషయాలు తెలిసాయి, ఈ మోసం Medical Transript మార్పించిన వాడు బెదిరించి డబ్బులు నెల నెలా గుంజేవాడు. ఇక వాడు ఎలా మార్చాడు అంటే సాధారణంగా ఇక్కడ వైధ్యులు వ్రాసిన Transript scan చేసి దాన్ని computer లోకి ఎక్కించి OCR తో గానీ మనుషుల చేతగానీ వాటిని అందరికీ అర్ధం అయ్యే computer లిపి లోకి మారుస్తారు, అదే నా మావయ్య అదునుగా తీసుకున్నాడు ఈ మార్పు చేయించే వాడికి డబ్బులు ఇచ్చి ఆ సమయంలో పనికి రాని మందులు వ్రాయించాడు.
ఆంధ్రుడు:అవును మీ మామగారు ఎందుకు అలా చేయించారు?
స్వామి:నీకు అనవసర విషయాలలో ఆత్రుత ఎక్కువ అనుకుంటా! సరే ఇక్కడ జరిగింది చెప్పిన కొన్ని విషయాల వల్ల మీకు మనుషుల మీద నమ్మకం సడలుతుంది,కానీ వాళ్ళను అలా తయారు చేసింది మనమే అని మరచిపోవద్దు, ఇక్కడ వాళ్ళ తప్పు ఎంత ఉందొ నా తప్పూ అంతే ఉంది. నిజానికి మా నాన్నగారు అస్వస్థతకు గురైనప్పుడు నా ధనార్జన తగ్గిపోయింది, అప్పుడు నాకు తెలియదు నా చుట్టూ ఉన్న వాళ్ళు నేను సేవ చేస్తాను అని నా దగ్గర ఉన్న వాళ్ళు కాదు ధనార్జన కోరిక ఉన్న వారు మాత్రమే అందరూ కాదు కొందరు. ఇంకో విషయం నా దగ్గర ఉన్న చాలా స్నేహితులు నన్ను వారించారు ధనం బ్రతకడానికి కావాలి కానీ బ్రతికేదే ధనం కోసం కాకూడదు, కనీసం నీ బంధువులతో ఎన్ని మార్లు మాట్లాడావు? వాళ్ళకు కొంచమైనా సాయం చెయ్యగలిగావా అని? అప్పుడు నా అభిప్రాయం కేవలం నా దగ్గరకు వచ్చే వాళ్ళు సహాయం ఆశించి అని కానీ ఇప్పుడు నా అభిప్రాయం నాకు సాయం చెయ్యడానికి వచ్చారు అని, ఎందుకంటే నా దగ్గర ఉన్న ధనంతో నేను పైకి ఆనందంగా ఉన్నా నిరంతరం క్షోభ అనుభవిస్తున్నాను, దాన్ని దూరం చేసుకుని బంధువులను మిత్రులను దగ్గర చేసుకుని ఉంటె ఇప్పుడు బ్రతికినట్టు ఆనందంగా బ్రతికే వాడిని.
అగమ్యి:ఇంతకీ మీరు మీ తండ్రిగారిని గుర్తుపట్టారా అని అడుగుతున్నారు ఈ తాతగారు!
స్వామి:వాళ్ళు నాకు దర్శనమే ఇవ్వట్లేదు అని అన్నాను ఇక వాళ్ళను ఎలా గుర్తు పట్టానో లేదో ఎలా చెప్పగలను.
ఈలోగా తండ్రి అగమ్యిని కూర్చోమని వారిస్తున్నాడు, అయినా అగమ్యి కూర్చోకుండా ఇంకో ప్రశ్న అడిగాడు
అగమ్యి:అవును వాళ్ళకు ఇచ్చిన Medical Prescription మీ దగ్గర ఉందా?
స్వామి:సంపాదించాను.
అగమ్యి:మాకు ఇవ్వగలరా, ఏమైనా ప్రత్యన్యాయం ఉందేమో తెప్పించగలం
(సశేషం....)

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.