ఆవులు శాకాహారులు అయితే రోగాలు రావు రాకపోతే(సంకర జాతులని పెంచి ..)

 స్నేహితుడు:మొదట ప్రయత్నిస్తాం తరువాత వారి వల్ల కాకపొతే వారిని రానివ్వం.
సంకర జాతులని పెంచి మానవ జాతి మనుగడకు ముప్పు తెస్తున్నారు!
స్నేహితుడు:వాళ్ళ దేశంలో లాగా మన దేశంలో కూడా పని వాళ్ళు ఎక్కువ కావాలి అన్న వాళ్ళ ప్రయత్నం, ప్రజలకు తమకోసం పనిచేసుకో నివ్వకుండా ఉండడం.
అగమ్యి:అర్ధం కాలేదు!
స్నేహితుడు:నిజానికి మన దేశంలో చాలా సంవత్సరాలుగా పారిశ్రామికీ కరణ తోక్కేసారు అని అరిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నిజానికి పారిశ్రామికీ కరణ వల్ల మనం మనకి కావలిసిన ఆహారం తయారు చేసుకోలేము అని తెలుసు కాబట్టి.
అగమ్యి:కొన్ని ఉదాహరణలు తెలుపగలరు!
స్నేహితుడు:సరే మొదటగా మనం నీకు తెలియని ఆవుల గురించి తెలుపుతాను, పారిశ్రామికీ కరణ లేక మునుపు ఆవులను మనం కేవలం పాల కోసం పెంచే వాళ్ళం, ఎందుకంటే మనం కొంతవరకూ పరాన్న జీవులం, కానీ పారిశ్రామికీ కరణ మొదలయ్యకా గోమాతలను ఆహారం కోసం పెంచడం మొదలు పెట్టారు.
కొన్ని పద్దతులు తెలుసుకుంటే ఒళ్ళు గోగుర్పాటుకు గురవుతుంది, అందులో మొదటి ఆవులు శాఖాహారులు, కానీ అవి శాఖాహారులుగా ఉండటం వలన పోషణకి అయ్యే ఖర్చు తగ్గించుకోవడానికి మరియు అధిక లాబాల కోసం వాటిని మాంసాహారులుగా మార్చారు, వాటికి పెట్టె ఆహారంలో గొర్రె మాంసాలను మరియు చనిపోయిన ఆవుల కళేబరములు ఆహారంగా పెట్టడం మొదలు పెట్టారు, తరువాతగానీ తెలియలేదు ఆ పరిశ్రమల యజమానులకు ఆ పద్దతి వలన Cancer వచ్చి ఆవులు చనిపోవడం పెరిగాయి అని, లాభం సంగతి అటుంచితే ప్రజల నుంచీ చేద్కరాలు ఎదురుకున్నార, అయినా బాగుపడ్డారా అంటే లేదు, తరువాత ప్రయత్నం సంకర జాతులు ఇవి ఎలాగా అంటే బంగారం చాలా ఉంది అని ఉపయోగించుకోవాలి అనుకునే వారు మీ దగ్గర ఉన్న సామాగ్రితో అది తవ్వుకోండి అంటే  కొంత మంది వచ్చి యంత్రాలతో తవ్వుతారు కదా అలాగ ఈ జాతులు.
అగమ్యి:అర్ధం కాలేదు :(
స్నేహితుడు:ఎలాగంటే ఆవులు కూడా వాతావరణంతో వృద్ధి చెందినవి ప్రాంతానికి అనుగుణంగా వాటి శక్తి ఉండేది, కానీ ఆ పరాయి దేశస్తులు మన దేశంలో మంచి మేలు రకమైన ఆవులను కొని తీసుకు పోయారు,
అగమ్యి:అమ్మిన వాడికి బుద్ధి లేదా?
స్నేహితుడు:డబ్బు పిచ్చి, తీసుకుపోయి కొన్ని జన్యుపరమైన మార్పులు చేసి వాళ్ళ దేశంలో బ్రతికేలా మార్చి తిరిగి మన భారతదేశ ప్రభుత్వం చేత అమ్మించారు.
అగమ్యి:మరి మేథావులు ఏమి చేస్తున్నారు?
స్నేహితుడు:మేథావులా ఎవరు వారు? Engineering చదివి ఈ ప్రక్రియకు మధ్యవర్తులుగా ఉన్నవారా? లేదా Political Science చదివి IAS అయిన వాళ్ళా?
అగమ్యి:అర్ధం కాలేదు ప్చ్.....
స్నేహితుడు:మన రాజ్యాంగం మనకు ఇచ్చిన అతి పెద్ద బహుమతి పెద్దల నుంచీ నేర్చుకోక పోవడం! దీని వల్ల మన దేశంలో పుట్టి పెరిగిన జాతులకు రోగాలు రానివ్వకుండా చెయ్యలేని స్థితికి వచ్చాము, ఇక పొతే మునుపే చెప్పాను కదా మన ఆవులను కొని వాటిని వాళ్ళ దేశంలో పెరగ గలిగేలా చేసి తిరిగి మనకు అమ్మారు, దాని వల్ల మనకు వచ్చ్చిన అనర్ధం ఎలాగూ మనం మన దేశంలో పెరిగే ఆవులను రోగాల బారిన పడకుండా చెయ్యడం తెలుసుకోలేక పోయాము ఇక వాటిని మన దేశంలో పెంచే ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది...
అగమ్యి:అదేమిటి ప్రభుత్వాలు అక్కడ బాగానే పాలిస్తున్నాయి అని అంటుంటారు కదా!
స్నేహితుడు:అదేమిటి ఇందాకా ఆవుల నుంచీ పాలు పితుకుతాం అంటే నిజామా అని అడిగావు మరి ఇప్పుడు ఈ విషయం ఎలా తెలిసింది?
అగమ్యి:ఆ అది నాకు ఇప్పుడు గుర్తుకు వచ్చింది ఆవు అంటే cow కదా!
స్నేహితుడు:తెలుగు కూడా మరచితివా! సరే నేను నీకు ముందే చెప్పాను అవి వాళ్ళ దేశం కోసం తయారు చేసుకున్న ఆవులు, జన్యు పరంగా అవి ఇక్కడ బ్రతకలేవు, మన దేశంలో నీది తప్పు అంటే నీది తప్పు అని అనడం రాజకీయ నాయకుడికి అలవాటే, ఇక ప్రజలకు వాళ్ళు చేస్తున్న తప్పుల వల్ల తమ తరువాత తరం దెబ్బతింటుంది అని అడగకపోవడం అలవాటే, ఎందుకంటే అందరం ప్రస్తుతాన్ని present అని భావించడం ఒక కారణం, ఇక ఈ దుస్థితి నుంచీ ఎప్పుడు బయటపడతుందో బయట ప్రపంచం!
ఇక ఇంకో రకం పారిశ్రామికీ కరణ, సాధారణంగా ఆవులు ఒక్కోమారు నెమరు వేసి ఆహారం తింటాయి, దాని వల్ల ఆవులకు ఆహారానికి ఆహారానికి మధ్య సమయం ఎక్కువ ఉన్నా పెద్ద నష్టం వాటిల్లదు, కానీ ఈ ప్రక్రియ వల్ల ఆవులు పెద్దవి కావడానికి కొంచం ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి వాటి యొక్క మొదటి అన్నాశయము కు గుంత ఏర్పరచి ఆ ఆహారాన్ని నలిపి చిద్రం చేసి తొందరగా రెండవ జేర్ణాసయం కు చేరేలా చేసి మనిషి యొక్క నీచ స్థితి ని చూపిస్తున్నారు.
(సశేషం...)

1 comment:

  1. మంచి వ్యాసము. చిన్న సవరింపు, "శాకాహారులు" అని ఉపయోగించాలి.

    -ఆ.సత్తిబాబు.

    ReplyDelete

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.