దేవుడు కోసం పనిచేస్తూ దెయ్యాలు మాత్రమే ధనవంతులు అవుతాయి

అగమ్యి:సరే మరి మీరు ప్రకృతి నుంచీ నేర్చుకున్నారు అంటున్నారు కదా ఏమి నేర్చుకున్నారు?
మన దగ్గర లభించేవి మనం ఉపయోగించం.
స్నేహితుడు:అదే చెప్పాను మనం ఉపయోగ పడేవి ఉపయోగించము, ప్రకృతి సృష్టిలో మనిషి మాత్రమె కాదు ఏ జీవరాశి ప్రకృతికి హాని కలిగించేది తయారు చెయ్యదు. కానీ మనం ఉపయోగించుకోవడం ఉపయోగించుకునే విధానం బట్టి ఉంటుంది, ఉపయోగం ఉందా లేదా అని నిశ్చయించగలం.
అగమ్యి:కొన్ని ఉదాహరణలు చెప్పండి!
స్నేహితుడు:మనిషికి ప్రకృతి అన్నీ అందించింది కానీ మనిషి ప్రతీదీ తయారు చేసి మనిషికి ప్రత్యామ్న్యాయం సృష్టించు కున్నాడు. మొదటగా మనిషికి కుంకుడు కాయలు ఉండగా shampoo లాంటివి.
అగమ్యి:అదేమిటి కుంకుళ్ళు ఉపయోగించినా జుట్టు రాలుతుంది కదా, అందుకు shampoo కావాలి కదా!
స్నేహితుడు:చిన్నప్పుడు అమ్మ తలకి కొబ్బరి నూనె మర్దనా చేసి తరువాత తలంటుకోవాలి అనేది, ఎందుకూ అని ప్రశ్నించే వాడిని, అమ్మ ఒక్కటే విషయం చెప్పింది అది ఆచారం పాఠిస్తే మంచిది కాబట్టి అనేది, మన జీవన విధానం పద్దతి వ్యతిరేకించడం తప్ప అది ఎందుకు చెయ్యాలి అని ఒక్కమారు కూడా ప్రశ్నించుకోలేదు ఎందువల్ల మంచిది అని అడగం కూడా అలా పెరిగి చిన్నప్పటి నుంచీ ఇలా వ్యతిరేక భావం పెంచుకుంది విజ్ఞత కోల్పోయి shampoo అవసరం చేసుకున్నాము. నిజానికి shampoo ల వల్ల దుష్పరిణామాలు ఎప్పటికీ మనం తెలుసుకోలేదు, మొట్టమొదటిది అది నిన్ను బద్దకస్తుడిని చేస్తుంది, రెండు మనం తలంటు కున్నప్పుడు నాలుగు వేళ్ళతో తలను మర్దనా చేసుకుంటాం దాని వల్ల శిరోభారం కొంచం తగ్గుతుంది, తరువాత కుంకుళ్ళు గానీ షీకాయ గానీ ఏవిధంగా చెడ్డది కాదు అది భూమిలో కలిసిపోతుంది కానీ shampoo తరువాత ఆ packet ఎక్కడ కరుగుతుంది?ఎలా భస్మం చెయ్యాలి? ప్రకృతి కాలుష్యం.
అగమ్యి:ఎందుకు ఇలా జరిగింది అంటారు?
స్నేహితుడు:ప్రకృతి లో లభించేవి జనాలకు దూరం చెయ్యడం ద్వారా.
అగమ్యి:దూరం చేస్తే ఏమి జరుగుతుంది?
స్నేహితుడు:నువ్వు మొదట్లో నాకు ఒక ప్రశ్న ఇచ్చావు అసలు ఈ ఆశ్రమం ఎలా నిలబడింది అని, అందరం కలిసి తీసుకున్న ప్రకృతి జీవనం వల్ల, ప్రకృతి కి జీవి ఉంటేనే అందం మనిషికి ప్రకృతి ఉంటేనే శ్రేయస్కరమైన జీవితం. అందుకే మొదటగా ప్రజలకు వివరించాను మనం మన జీవన విధానంలో చేసుకుంటున్న తప్పులు, నేను రాక మునుపు రామానుజుల వారు ప్రకృతి తో తయారైన వాటిని ఎలా ఉపయోగించాలో తెలిపారు, కానీ వాటి లభ్యత లేక జనాలు ఇంకా అశాస్త్రీయ పద్దతిలో తయారైన shampoo లాంటి వాటిని వాడుతూనే ఉన్నారు, అందుకని మొదటగా నేను ఎంచుకున్న మెట్టు
అగమ్యి:ఆగండి ఆగండి అశాస్త్రీయ పద్దతా, వాటికి patents ఎన్నో పురస్కారాలు లభిస్తుంటే!
స్నేహితుడు:అశాస్త్రీయ పద్దతి అంటే అవసరమైన దానిని సేకరించి పనికి రానిది జనావాసాలలోకి వదలడం.
అగమ్యి:మరి మీరు జనాలు వదిలే మలం ఎలా పనికి వచ్చేదిగా చేస్తున్నారు?
స్నేహితుడు:అది నీకు తరువాత చెబుతాను. ఈ ఆశ్రమం ఒక్క రాత్రిలో కట్టినది కాదు, ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర, ఇక నీకు  మేము ఇక్కడ ప్రకృతి విధానం ఎలా తెచ్చానో చెబుతాను. కుంకుళ్ళు అన్ని ప్రదేశాలలో పెంచలేము కాబట్టి దగ్గరలోని అటవీ ప్రాంతంలోని గిరిజనుల సాయంతో కుంకుళ్ళ చెట్లు నరకకుండా ఆపించి ఎందుకంటే వాళ్ళే చెట్టును దేవతగా కొలిచేది, కుంకుళ్ళ ఉపయోగం ప్రజలకు వివరించి shampoo దూరం చేసాం.
అగమ్యి:గిరిజనులు మీ నుంచీ ఏమీ కోరలేదా?
స్నేహితుడు:కోరారు కేవలం వాళ్ళను మనుషులుగా గుర్తించమని, అప్పుడు నాకు చాలా బాధ వేసింది మన హేయమైన కోరికల వలన అభివృద్ధి అని పరిగెడుతూ అందరినీ మరుస్తున్నాము అని మరియు మనం మనిషి అనే విషయం కూడా మరచి పోతున్నాము.
అగమ్యి:సరే వీటి సంగతి తరువాత, మీ అభిప్రాయం తెలివైన వాడు ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాడు అనా?
స్నేహితుడు:కాదు తెలివైన వాడు ఏది మన జీవనానికి ఉపయోగ పడుతుందో తెలుసుకోకుండా ఇంకొకడి ఉచ్చులో పడి వాడిని ధనవంతుడిని చేస్తున్నాడు.
(సశేషం...)

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.