పురాతన జీవన విధానం ఎన్నుకుంటే తప్పే (గమ్యం ఏమిటి? ఏ దారి ఎన్నుకోవాలి?)

గమ్యం ఏమిటి? ఏ దారి ఎన్నుకోవాలి?
వ్యతిరేకి:ఎందుకంటే !
అగమ్యి:ఇంతకీ నేను ఏ మార్గం ఎన్నుకోవాలి?
స్వామి: నాయనా నేను ఈ గమ్యం ఎన్నుకున్నదే నా వాళ్ళను నేను దూరం చేసుకుని శిక్షగా. ఇక నీ ప్రశ్న(భారతీయుడు వైపు చూస్తూ) నాయనా అదే మానవ నైజం ప్రకృతిలో లభించేవాటికి ఎందుకు డబ్బులు చెల్లించాలి , ప్రకృతిలో లభించని వాటిని ఎంత ధరైనా కొనడానికి వెనకాడక పోవడం. ఇక మా ఆశ్రమ ధరలకు కారణం హిందుత్వం వైపు మరలితే పన్ను చెల్లించాలి, ఎందుకంటే భారత రాజ్యాంగంలోని ఒక శాసనం ప్రకారం హిందూ ఆశ్రమాలు పన్ను చెల్లించాలి మరి అవి ఎవరు చెల్లిస్తారు?
భారతీయుడు: ఆ కక్కారు కద విషం, వాళ్ళు చేస్తున్నాట్టు సమాజ సేవ మీరు చెయ్యట్లేదు కదా.
స్వామి:నిజమే నాయనా మన దేశంలో మన మతం ఆచరించడం తప్పు, మన వారికోసం సమాజ సేవ అంటే మీరు చూస్తున్న దృష్టిలోపం అనుకోవాలి ఎందుకంటే విదేశాలలో విలాశాలకు అలవాటు పడి బ్రమ్మచర్యం ఆచరించడం మానేసారు, అందుకని అక్కడ తండ్రులు సోదరీమణులు తక్కువయ్యారు అందుకని, పైగా జమానాలలో చేసిన తప్పులను ఇప్పటికీ తిప్పిస్తూ విషం జల్లుతున్న కుహానామేధావులు మాటలే నిజం అనిపిస్తాయి మీకు - మీరు మీ మెదడును వాడటం మాని సంవత్సరాలు అయ్యింది కాబట్టే ఈ దుస్తితి.
భారతీయుడు: ఆ నేను తెలివైన వాడినే, వాళ్ళు చెప్పింది నిజం కాబట్టే నమ్ముతున్నాను.
స్వామి: ఎంతశాతం? నీ వరకు నువ్వు ఎంత ఆ వర్గంలో ఉన్నావు?
భారతీయుడు: నేను ఆ వర్గంలో ఎలా ఉన్నాను?
స్వామి:నిజమే నేనూ అదే అనుకుని ఇప్పుడు ఈ కాషాయ వస్త్రాలు ధరించాను, నీకన్నా ఎక్కువ కుహానామేధావుల మాటలు నమ్మాను, తరువాత తెలిసింది ఏమి పోగొట్టుకున్నానో, వారిలో కొందరి అభిప్రాయాల వల్ల యంత్రాలు తయారు చెయ్యడం ప్రారంభించి నా చేతులు నరుక్కున్నాను.
అగమ్యి:అంటే యంత్రాలు తయారు చెయ్యడం తప్పా?
స్వామి: దానికి నా వద్ద సమాధానం నా పరిదిలో "అతిసర్వాత్ర వర్జయేత్".
భారతీయుడు: ఆ మీరు అలాగే చెబుతారు అవి లేకపోతే ఈ రోజు మా ఉద్యోగాలు ఉండేవా?
స్వామి: నిజమే తండ్రి మీ ఉద్యోగాలు ఉన్నది మీరు వేరే వారికోసం పని చెయ్యడానికే, సరే ఇక కొన్ని ఉదాహరణలు చెబుతాను
౧. కంచములు కడుగు సాధనం - మనిషికి చేతులు ఉండగా వీటి ఉపయోగం ఏమిటి?
భారతీయుడు: అదేమిటి మాకు సమయం లేదు కాబట్టి మేము ఆ వస్తువు ఉపయోగిస్తున్నాం
వ్యతిరేకి: దేనికి కార్యాలయం వెళ్ళడానికి ౩ గంటలు రావడానికి ౩ గంటలా? లేదా దుబారా ఖర్చులు చెయ్యడానికా? లేదా gym కు వెళ్ళడానికి.
భారతీయుడు:నువ్వు మధ్యలో మాట్లాడకు, నీ లాంటి వాళ్ళు వల్లే వీళ్ళు ఇలా రెచ్చిపోతున్నారు.
స్వామి: నిజమే నాయనా మాకు మిమ్ములను దోచుకోవడం తప్ప వేరే పని లేదు, నా ఆస్తి కేవలం నేను చేసిన తప్పులు ఒప్పులు, ఇక్కడ వున్న ఏదీ నా ఆస్తి కాదు, కేవలం నేను ఉండటానికి ప్రదేశం.
ఇక నీవు అడిగావు కాబట్టి చెబుతున్నాను, ఈ ప్రపంచంలో మనం ఏది తయారు చేసినా అది మన సృష్టికి కావలిసిన వాటి నుంచే తయారు చేస్తాం, ఉదాహరణకు ఆ గిన్నెలు కడుగు సాధనం వచ్చినది ఇనుము మరియు చెక్క మరియు నూనె, నూనె అంటే నూనె కాదు ఆజ్యం. వీటిలో మానవ నిర్మాణంలో లేనిది ఏది?
భారతీయుడు:నీలాంటి వాళ్ళ వల్లే ఈ దేశం ఇలా వెనకపడిపోయింది.
స్వామి:నిజమే నా పేరున మూడు వందల పైచిలుకు patents ఉన్నాయి కనుకా?
భారతీయుడు:ఎవరు నువ్వు? అసలు అన్ని patents నీ పేరు మీద ఎందుకు ఉన్నాయి?
స్వామి: నీలాగే పురాతన జీవన విధానం ఎన్నుకుంటే తప్పే అనుకుని జీవితం ఆరంభించిన ఒక శాస్త్రవేత్తను.
అగమ్యి:మరి ఎందుకు ఈ మార్గం ఎన్నుకున్నారు?
(సశేషం....)

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.