నేను నుంచీ మనకు మారండి(No to Equities and Mutual Funds)

నిజానికి వాటిలో మనకు ఒరిగేది చాలా తక్కువ, అసలు జరిగినది ఇది చూపిస్తున్నాది ఇలా
Trading companies మీ దగ్గర ఎక్కువ మొత్తంలో సొమ్ము చూసాయి, వాళ్ళకి మీ దగ్గర నుంచీ దోచుకునే మార్గం కావాలి, అంతే ఇలాంటి ఒక టపా మీ నెత్తిన రుద్దాయి
అమ్మో అనుకుని అందరూ ఆ Trading company సూచనలు పాఠించారు. అలా ఆ Trading Company కొన్ని రోజులు మీకు లాభాలు చూపించింది ఎందుకంటే నష్టం వస్తే నువ్వు Trading మానేస్తావు కదా దాంతో వాళ్ళ లాభం తగ్గిపోతుంది. అలా కొన్నిరోజులకు ఏమి జరిగినది అంటే నువ్వు ఇప్పటి వరకూ చేస్తున్న Business వ్యవసాయం అయితే వ్యవసాయం మానేసి Trading Company Analysis లు నీ Analysis లు చేసుకుంటూ డబ్బులు మొత్తం Equity Trading లో ఉంచావు. దాంతో అప్పటి వరకూ నీ దగ్గర పనిచేసున్న వాళ్ళకు ఉధ్యోగాలు పోయాయి నీ వల్ల ఉత్పత్తి తగ్గిపోయింది, ఇలా ఉత్పత్తి తగ్గేసరికి ధరలు పెరిగాయి.

ఇది మళ్ళీ ఆ Trading Company కు కలిసి వచ్చింది, ఎందుకంటే నీ దగ్గర ఉధ్యోగాలు పోయిన వాళ్ళందరినీ వెనక వేసుకుని ఇంకొంత మంది చేత Equity Trading మొదలు పెట్టించారు.

ఇలా ఎక్కువ మంది Equity Traders అయ్యేసరికి ధరలు పెరిగాయి ఎందుకంటే పొలం పనిచేసుకుంటే వచ్చే లాభం తక్కువ అని. ఈలోగా కొంతమంది ఉధ్యోగాలు కోసం అని చెప్పి Software చెట్టు ఎక్కి కూర్చున్నారు, అది ఎలా పనిచేస్తుంది అంటే పూల మొక్క పక్కన కొబ్బరిచెట్టు దాని పక్కన మర్రిచెట్టు లాగా, అంటే కొత్త Software వచ్చినప్పుడు పాతది చాల నశించిపోతుంది కదా అలాగ, అది తెలిసి కూడా వస్తున్న సొమ్ము చూసి . వీళ్ళు కూడా Equity Trading మొదలు పెట్టారు వీళ్ళకు డబ్బులు వచ్చింది అది ఎక్కడ నుంచీ Banks లాభాల నుంచీ. ఇలా చాలా డబ్బులు Banks దగ్గర లేదా అవసరం అయినవాడి దగ్గర లేకుండా పోయాయి.వీళ్ళు కూడా Plots అని ఇళ్ళు అని పంట పొలాలు లేకుండా చేసేస్తున్నారు అసలు హైదరాబాదు బెంగళూరు లాంటి Pre planned ప్రదేశాలను కూడా నాశనం చేసెసారు దాంతో Banksకు రుణాలు పెరిగిపోయాయి. నాకు ఇప్పటికీ అర్ధం కాని విషయం అసలు Banks నిర్మాణానికి ౩ లక్షలు అయితే ౩౫ లక్షలు Loan ఎలా ఇస్తాయో అని, సర్లే దాని గురించి తరువాత టపాలో మాట్లాడుకుందాం, ఇప్పుడు హైదరాబాదు బెంగళూరు pre planned అని దాన్ని మనం నాశనం చేసామని అన్నాను కదా దాని దగ్గరకు వద్దం.

నేను ఒక సారి ఈనాడు వార్తాపత్రికలో చదివాను అని గుర్తు, అప్పటి రాజు కెంపేగౌడ దరిదాపు ౧౩౦ చెరువులు తవ్వించాడంట ఎందుకంటే ఒకవేళ ఇక్కడకు తన సామ్రాజ్యం తరలించినా ప్రజలకు దాహం తీర్చవచ్చు అని కానీ ఇప్పుడు అక్కడ ఉన్న చెరువులు ఎన్ని ౨౩ మిగిలినవి ఏవి అంటే అవన్నీ Buildings కట్టడానికి ఉపయోగించేసారు కదా దాంతో వాళ్ళకు నీళ్ళ కష్టాలు, ఇక హైదరాబాదు Hussain sagar గురించే వర్ణిద్దాం ఒకవేళ భారీ వర్షాలు వస్తే జనావాశంలో నీరు ఉండిపోతుంది పైగా అది రాళ్ళ కొండలతో నిండినది కాబట్టి నీళ్ళు ఇంకడానికి కుదరదు అని Hussain sagar చుట్టూ ఖాళీ స్థలం ఉండేది, కానీ ఇప్పుడు అసలు నీరు వెళ్ళడానికి ఆస్కారం లేకుండా ఇళ్ళు తరువాత ఆ స్థలం అంతా భూకభ్జాలు అయిపోయాయి. నీళ్ళు కొనాల్సిన పరిస్థితి. దీంతో మళ్ళీ ధరలు పెరిగాయి ఎందుకంటే అవసరం ఎక్కువైనప్పుడే కదా ధర ఎక్కువ ఉండేది.

ఇవన్నీ సాకులా అసలు Equity trading చెయ్యడానికి మనం మన దగ్గర ఉన్న సొమ్ము అవసరమైనవాడికి ఇవ్వాలి కానీ అవసరం లేని చోటకు మరల్చకూడదు ఎందుకంటే మనం బ్రతకడానికి మనం కావాలి.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.